హత్య కేసులో జైలుకు.. MLAగా విజయం

40032చూసినవారు
హత్య కేసులో జైలుకు.. MLAగా విజయం
బిహార్‌లోని మోకామా నియోజకవర్గంలో హత్య కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న జేడీ(యూ) నేత అనంత్ కుమార్ సింగ్ MLAగా విజయం సాధించారు. ఆయన ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంత్ కుమార్ సింగ్‌కు 91,416 ఓట్లు రాగా, వీణా దేవికి 63,210 ఓట్లు లభించాయి. జన్ సురాజ్ పార్టీ పోల్ వర్కర్ దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ కుమార్ సింగ్‌ను నవంబర్ 2న అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్