
కిచ్చా సుదీప్ ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ విడుదల!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ‘దేవరాయ’ టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సుదీప్ ప్రసిద్ధ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించనున్నారు. “కన్నడ రాజ్య రామ రమణ.. మూడు రాయరా గండ.. ఆంధ్ర భోజ.. శ్రీకృష్ణదేవరాయ” అనే బిరుదులతో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ పాన్-ఇండియా మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, 2027 డిసెంబర్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.




