
నిలకడగా ధర్మేంద్ర ఆరోగ్యం.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా.. బుధవారం ఉదయం ఆయన డిశ్చార్జ్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా చికిత్స జరుగుతున్న సమయంలోనే మంగళవారం సోషల్ మీడియాలో ధర్మేంద్ర ఆరోగ్యం విషమించిందంటూ, మరణించారంటూ తప్పుడు వార్తలు ప్రచారమైన విషయం తెలిసిందే.




