
మహిళను దారుణంగా కొట్టి చైన్ స్నాచింగ్ (వీడియో)
హైదరాబాద్లోని కొంపల్లి జైభేరీ కాలనీలో ఆయిల్ షాపులోకి చొరబడిన ఓ వ్యక్తి యజమానురాలిపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు స్పందించి దుండగుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.




