న్యూ విజన్ పాఠశాలలో అంబరాన్నంటిన 'జంబోరి' సంబరాలు

57చూసినవారు
న్యూ విజన్ పాఠశాలలో అంబరాన్నంటిన 'జంబోరి' సంబరాలు
నిత్యం పాఠాలు, పరీక్షలు, ఫలితాలతో బిజీగా గడిపే విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు, వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఖమ్మం నగరంలోని న్యూ విజన్ పాఠశాల వేదికైంది. పాఠశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక ఉత్సవం 'జంబోరి - యుపోరియా 2026' శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం అర్బన్ ఎంఈఓ శ్రీమతి కె. వి. శైలజ లక్ష్మి, 'పాడుతా తీయగా' ఫేమ్ గాయకులు సిద్దు, మహతిలు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ శైలజ లక్ష్మి మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆధునిక కాలంలో పిల్లలు దారి తప్పకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల చైర్మన్ సి.హెచ్. జి.కె. ప్రసాద్ మాట్లాడుతూ, విద్య అంటే కేవలం తరగతి గదుల బోధనే కాదని, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించేందుకే ఇలాంటి కల్చరల్ జంబోరి నిర్వహిస్తున్నామని తెలిపారు.
తొలిరోజు విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, జానపద గీతాలు మరియు దేశభక్తి నృత్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా తెలుగు, హిందీ సినిమా పాటలకు చిన్నారులు వేసిన స్టెప్పులు సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగించాయి. కార్యక్రమం మొదటి రోజున 130 అంశాలపై విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ వేడుకలు శనివారం కూడా కొనసాగుతాయని తెలిపారు.  రెండు రోజుల కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ నుండి పదవ తరగతి వరకు గల విద్యార్థులు మొత్తం 270 డాన్సులు ప్రదర్శించునున్నట్లు ఆయన తెలిపారు. 3000 మంది విద్యార్థులతో సభా ప్రాంగణం వికసించింది.
కార్యక్రమంలో న్యూ విజన్ విద్యా సంస్థల చైర్మన్  సిహెచ్ జీకే ప్రసాద్ డైరెక్టర్ సిహెచ్ గోపీచంద్, డైరెక్టర్ సి హెచ్ కార్తీక్, పి.స్ఫూర్తి ప్రిన్సిపాల్ ఎండి అబాద్ అలీ, మాధవి, మైకేల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

 ఇట్లు,
ఎం డి అబాద్ అలీ,
ప్రిన్సిపాల్,
న్యూ విజన్ స్కూల్.

సంబంధిత పోస్ట్