ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కొత్త బిల్లుపై లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన
Dec 16, 2025, 08:12 IST/

కొత్త బిల్లుపై లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన

Dec 16, 2025, 08:12 IST
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం 'వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీ-జీ రామ్‌ జీ) బిల్లు- 2025'ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంపీ ప్రియాంక గాంధీ ఈ బిల్లు ఎంజీ నరేగాను బలహీనపరుస్తుందని, పేదల ఉపాధిని తగ్గిస్తుందని ఆరోపించారు. పంచాయతీల హక్కులను దూరం చేసి, కేంద్ర నియంత్రణ పెంచుతున్నారని విమర్శించారు. టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, రాముడి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని, గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.