
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రూ.10 లక్షలు ఖర్చుపెట్టిన భర్త!
8 నెలల పరిచయం తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వ్యక్తికి పెళ్లయిన తొలిరాత్రే ఊహించని షాక్ తగిలింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే చేసుకున్నానని భార్య చెప్పేసింది. బాధితుడు ఆమెను బలవంతం చేయకుండా విడిపోవాలని నిర్ణయించుకోగా.. చట్టబద్ధంగా విడాకులు పొందడానికి రెండేళ్లు పట్టడమే కాకుండా, భరణం, కోర్టు ఖర్చుల కోసం ఆ వ్యక్తి రూ. 10 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.




