భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలం అవుతోంది. గడిచిన 24 గంటల్లో జమ్మూ ప్రాంతంలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 24 గంటల్లో ఉధంపూర్‌లో 63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల నుంచి 5 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తావి, రావి, చీనాబ్, ఉఝ్ నదులు ఉప్పొంగి వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో మృతుల సంఖ్య 36కి చేరింది.