తమిళనాడులో విజయ్ 'జన నాయగన్' సినిమా చుట్టూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో విజయ్‌కు సీఎం ఎం.కే. స్టాలిన్ తన పూర్తి మద్దతును ప్రకటించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సెన్సార్ బోర్డును ఒక రాజకీయ ఆయుధంగా మలచుకుని, తమకు వ్యతిరేకంగా ఉన్న గొంతులను అణచివేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కళాకారుల సృజనాత్మకతపై రాజకీయ పెత్తనం చెలాయించడం ప్రజాస్వామ్య విలువలకే విఘాతమని స్టాలిన్ స్పష్టం చేశారు.