జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక మార్చి 14న పిఠాపురంలో జరగనుంది. ఆ రోజు పిఠాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయించారు. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో జనసేన విజయ బావుటా ఎగుర వేసిందని, ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న ఆవిర్భావ సభను శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.