AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం ఈవో రామకృష్ణంరాజుపై జనసేన నేత, మాజీ కౌన్సిలర్ సూర్యప్రకాశ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం గర్భగుడి నుంచి బయటకు వచ్చే క్యూలైన్ ద్వారా జనసేన నేత సూర్య ప్రకాశ్ తన వారిని లోపలకు పంపించే ప్రయత్నం చేశారు. దీనిని ఈవో రామకృష్ణంరాజు అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన సూర్య ప్రకాశ్ దాడికి దిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.