‘చుట్టమల్లే’ సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్

4చూసినవారు
‘చుట్టమల్లే’ సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్
‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాటను AI సాంకేతికతతో అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేయడంపై హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ స్పందించారు. ఇలాంటి నకిలీ వీడియోలను ఎవరూ సృష్టించొద్దని, ఇతరులతో షేర్‌ చేయడం లేదా ప్రచారం చేయడం చేయొద్దని కోరారు. AI సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయడం తీవ్రంగా కలవరపెడుతోందని పేర్కొన్నారు. ఈ తరహా వికృత చర్యలకు పాల్పడిన వారిపై తప్పకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఇదే అంశంపై హీరో ఎన్టీఆర్‌ కూడా స్పందించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్