తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లను ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.