
సిలిండర్ల డెలివరీపై కేంద్రం ప్రకటన
వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని స్పష్టం చేసింది. LPG ఉత్పత్తిని 25 శాతానికి పెంచినట్లు పేర్కొంది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నామని, హార్ముజ్ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్లు పేర్కొంది. ఇక త్వరలో భారత్కు రెండు LNG కార్గో షిప్లు రానున్నట్లు చెప్పింది.




