
ఎన్నికల్లో గెలిస్తేనే మాస్క్ తీస్తానని.. ఓడిపోయింది
బిహార్ ఎన్నికల్లో గెలిస్తేనే మాస్క్ తీస్తానని శపథం చేసిన ది ప్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పమ్ ప్రియా చౌదరికి షాక్ తగిలింది. దర్భంగా నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయింది. బీజేపీ అభ్యర్థి సంజయ్ సరోగి మరోసారి విజయం సాధించారు. కాగా, బిహార్‌కు కొత్త బ్రాండ్ తీసుకొస్తానంటూ 2020లో ప్రియా చౌదరి ‘ది ప్లూరల్స్ పార్టీ’ని స్థాపించారు. 2020లో 148 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో 243 స్థానాల్లో బరిలోకి దిగారు.




