విదేశాల నుంచి ఛార్టెడ్ ఫ్లైట్‌లో తిరిగొచ్చిన JC (వీడియో)

65చూసినవారు
AP: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విహార యాత్రలో భాగంగా విదేశాలకు వెళ్లారు. అయితే మంగళవారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో ఆయన హుటాహుటిన విదేశాల నుంచి స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్‌లో సోమవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాత్రికి తాడిపత్రికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్