కూలీపై మట్టిపోసిన జేసీబీ డ్రైవర్.. గంటకు పైగా నరకయాతన (వీడియో)

17061చూసినవారు
TG: జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పని చేస్తున్న కూలీపై మట్టి పోశాడు. ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలో జరిగింది. ఓ స్కూల్ ఎదురుగా పైప్ లైన్ పనులు జరుగుతుండగా జేసీబీతో కాలువ తీస్తున్న క్రమంలో సంతోష్ అనే వలస కూలీపై జేసీబీ డ్రైవర్ మట్టి పోశాడు. గట్టిగా కేకలు వేసినా వినిపించుకోలేదు. దీంతో గంటకు పైగా నరకయాతన అనుభవించాడు. తోటి కూలీలు, స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సంతోష్‌ను బయటకు తీశారు. జేసీబీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :