
బ్రిటన్ యూనివర్సిటీల్లో పాక్, బంగ్లా విద్యార్థులకు వీసా నిషేధం
బ్రిటన్ ప్రభుత్వం కొవెంట్రీ, చెస్టర్ వంటి 9 విశ్వవిద్యాలయాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించింది. ఫోర్జరీ, నకిలీ పత్రాలు, ఇంగ్లీష్ అర్హత డాక్యుమెంట్లలో అవకతవకలు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ విద్యార్థుల్లో 18%, బంగ్లాదేశ్ విద్యార్థుల్లో 22% మంది వీసాల్లో తప్పుడు సమాచారం ఉన్నట్లు గుర్తించారు. అమెరికా వంటి దేశాల్లో వీసా ఆంక్షల నేపథ్యంలో యూకే వైపు విద్యార్థుల ప్రయాణం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వారి విద్యా భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.




