IIT రూర్కీ JEE అడ్వాన్స్ -2026 పరీక్ష తేదీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 17న ఈ పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. పూర్తి షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని IIT రూర్కీ తెలిపింది. JEE మెయిన్ పరీక్షలో టాప్ 2.5 లక్షల ర్యాంకులు సాధించిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులు. JEE మెయిన్ పరీక్షలు జనవరి, ఏప్రిల్ నెలల్లో జరుగుతాయి.