దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన
జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced-2026) పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ సోమవారం ఉదయం 10 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది. లక్షలాది మంది
విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డులు, ఆలిండియా ర్యాంకులను తెలుసుకోవచ్చు.