
నల్లమల టైగర్ సఫారీ.. ఈ నెల 1 నుంచి పునఃప్రారంభం
తెలంగాణ టూరిజం డిపార్ట్ సహకారంతో నల్లమల నైట్ లైఫ్ సఫారిని ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు. దేశంలో రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. దాదాపు 2611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అడవిలో పులలతో పాటు ఇంకా ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. దీన్ని అమ్రాబాద్ పులుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. పెద్దపులుల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని జులై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు. అక్టోబర్ 1 నుంచి టైగర్ సఫారి తిరిగి ప్రారంభమైంది.




