భారతీయ చలనచిత్ర పరిశ్రమ, ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగంలో ఒక శకాన్ని సృష్టించిన లెజెండరీ నిర్మాత ఆర్.బి. చౌదరి మే 5న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన తండ్రి అకాల మరణవార్త తట్టుకోలేక ఆయన చిన్న కుమారుడు, నటుడు జీవా బోరున విలపించిన దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. తన తండ్రిని తన రోల్ మోడల్‌గా భావించే జీవా.. ఫోన్లో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.