తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నివాసంలో కలిసి, బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌కు జీవన్ రెడ్డితో నాలుగు దశాబ్దాలకు పైగా స్నేహం ఉందని, గతంలోనే బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు.