జెఫ్రీ ఎప్‌స్టీన్ ‘సూసైడ్ నోట్’ విడుదల

29చూసినవారు
జెఫ్రీ ఎప్‌స్టీన్ ‘సూసైడ్ నోట్’ విడుదల
లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణించిన ఐదేళ్ల తర్వాత, ఆయన రాసినట్లుగా చెబుతున్న ఓ లీగల్ ప్యాడ్ నోట్‌ను బహిర్గతం చేయాలని యూఎస్ జిల్లా జడ్జి కెన్నెత్ కరాస్ ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ నోట్‌ను అన్‌సీల్ చేశారు. ఇందులో ఎప్‌స్టీన్ తనపై ఉన్న ఆరోపణలు, తన స్థితి గురించి వివరించారు. పోలీసులు నెలల తరబడి దర్యాప్తు చేసినా ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. 'వీడ్కోలు చెప్పడానికి సమయాన్ని ఎంచుకోగలగడం ఒక వరం' అని, 'నేనేం చేయాలని కోరుకుంటున్నారు - ఏడవాలా! ఇది సరదా కాదు.. దీనికి విలువ లేదు' అని రాసినట్లుగా ఉంది.

సంబంధిత పోస్ట్