
ఇరాన్ ఏఐతో నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తోంది : ట్రంప్
ఇరాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించి మీడియా సంస్థల ద్వారా తప్పుడు సమాచారాన్ని, నకిలీ చిత్రాలు, వీడియోలను వ్యాప్తి చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఏఐ ప్రమాదకరమైనదని, దానితో జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. ఇరాన్ నాశనమవుతోందని, వారు గెలిచే యుద్ధాలను మాత్రమే ఏఐ ద్వారా సృష్టించి, అవినీతి మీడియా ద్వారా పంపిణీ చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. రాడికల్ లెఫ్ట్‌వింగ్ ప్రెస్ కూడా దీనికి తెలుసునని, అయినా తప్పుడు కథనాలు, అబద్ధాలతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.




