రిలయన్స్ జియో, BSNL భాగస్వామ్యంతో ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ICR) రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో కవరేజీ లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ద్వారా సేవలు అందించడమే దీని లక్ష్యం. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో రెండు ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్లాన్లు జియో సిగ్నల్ లేనప్పుడు BSNL నెట్‌వర్క్‌పై మాత్రమే పనిచేస్తాయి. మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.