
టీడీపీలో ఇక నుంచి మహిళలకు 33శాతం సీట్లు: మంత్రి లోకేశ్
AP: మహిళలకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ భారీ ప్రకటన చేశారు. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహానాడులో తెలిపారు. పార్లమెంట్లో బిల్లు పాసైనా, అవ్వకున్నా 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని, పార్టీలోని పదవుల్లోనూ అవకాశం ఇస్తామని ఆయన వెల్లడించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలిసారి మహానాడులో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు భారీ ప్రకటన చేస్తున్నట్లు లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.




