
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు.. ఇరాన్ ప్రతిపాదనకు ట్రంప్ నిరాకరణ
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని, ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ వైమానిక దాడులు చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ తన సహాయకులతో చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. ఇరాన్ ప్రతిపాదనలో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణు కార్యక్రమంపై చర్చలు పునఃప్రారంభించడం ఉన్నాయి. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవచ్చని టెహ్రాన్ ప్రతిపాదించింది.




