రిలయన్స్ జియో సంస్థ దీపావళి, ధంతేరాస్ పండుగలను పురస్కరించుకుని రూ.349తో ఒక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా 3 నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (మొబైల్/టీవీ), 50GB జియో క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందిస్తున్నారు. అలాగే హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజెస్, ఎంటర్టైన్‌మెంట్ సేవలతో కూడిన జియో హోమ్ ఫ్రీ ట్రయల్ కూడా 2 నెలల పాటు పొందవచ్చు.