
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ రేట్లపై అప్రమత్తత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఒత్తిడికి లోనై పడిపోయాయి. హెల్త్‌కేర్, మెటల్, పవర్ రంగాల్లో నష్టాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా తగ్గాయి. సెన్సెక్స్ 83,938.71 వద్ద, నిఫ్టీ 25,722.10 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 88.77గా ఉంది.




