అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నియమించింది. ఇటీవల అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలు, కానుకల చోరీ వివాదం నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియామకం ద్వారా ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉంది.