ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ నియామక రాత పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈనెల 16, 17 తేదీల్లో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువ పత్రాల పరిశీలన జరగనుంది. కాల్ లెటర్లు రానివారు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.