TG: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ విద్యాశాఖ శుభవార్త అందించింది. రేడియంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెరిగి సులభంగా
ఉద్యోగాలు పొందవచ్చని అభిలాష అభినవ్ తెలిపారు.