
సిమ్ కార్డుల దుర్వినియోగం.. రూ. 50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు!
మీ అనుమతి లేకుండా మీ ఆధార్ సమాచారాన్ని ఉపయోగించి జారీ చేసిన సిమ్ కార్డులు నేరాలకు పాల్పడితే రూ. 50 లక్షల వరకు జరిమానా, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) ప్రకారం.. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి TAFCOP అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వాలి. జాబితాలో మీకు తెలియని నంబర్లు ఉంటే, 'నా నంబర్ కాదు' ఆప్షన్‌ను ఎంచుకుని రిపోర్ట్ చేయవచ్చు. ఇది గుర్తింపు దుర్వినియోగం, మోసాలను నివారించడంలో సహాయపడుతుంది.




