తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)
నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు వేతనం అందనుంది. అగ్రికల్చర్‌లో డిగ్రీతో పాటు సీడ్ టెక్నాలజీ లేదా ప్లాంట్ బ్రీడింగ్‌లో ఎంఎస్సీ (అగ్రికల్చర్) అర్హత ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 7న ప్రారంభమై ఆగస్టు 8తో ముగియనుంది.
Website Link: https://websitenew.tgpsc.gov.in/