
2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది: సీఎం చంద్రబాబు
AP: కర్నూలు శివారులోని నన్నూరు వద్ద గురువారం 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' బహిరంగసభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉందని అన్నారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలందరూ లబ్ధి పొందారని సీఎం తెలిపారు.




