
ఇక నుంచి వెండిపై కూడా రుణాలు!
వెండి ఆభరణాలు, వస్తువులు, నాణేలను తాకట్టు పెట్టి రుణాలు పొందే అవకాశం 2026 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుందని ఆర్బీఐ తెలిపింది. పేదలు, మధ్యతరగతికి రుణ లభ్యతను సులభతరం చేయడమే దీని ఉద్దేశ్యం. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉన్న వెండి బార్లపై ఈ సదుపాయం ఉండదు. వెండి రుణాలపై వడ్డీ రేట్లు, లోన్-టు-వాల్యూ నిష్పత్తులు బంగారం రుణాలతో భిన్నంగా ఉండవచ్చని ఆర్బీఐ పేర్కొంది.




