నేడు ఢిల్లీ హైకోర్టులో జూనియర్‌ ఎన్టీఆర్‌ కేసు విచారణ

29చూసినవారు
నేడు ఢిల్లీ హైకోర్టులో జూనియర్‌ ఎన్టీఆర్‌ కేసు విచారణ
నేడు ఢిల్లీ హైకోర్టులో నటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన కేసు విచారణ జరగనుంది. తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో తన పేరు, ఫోటోలు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఎన్టీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చర్యలు తన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఈ కేసును నేడు జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారించనుంది.

సంబంధిత పోస్ట్