హైకోర్టుకు జూ.ఎన్టీఆర్.. కారణమిదే?

17చూసినవారు
హైకోర్టుకు జూ.ఎన్టీఆర్.. కారణమిదే?
ఈ-కామర్స్, సోషల్ మీడియాలో తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని కోరుతూ జూ.ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. 2021 ఐటీ నిబంధనల ప్రకారం సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో డిసెంబర్ 22న పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేస్తామని, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. గతంలో నటుడు నాగార్జున కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్