జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ తమ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్డీఏ భాగస్వామి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రచారంలోకి దించాలని యోచిస్తోంది. జూబ్లీహిల్స్‌లో సినీ కార్మికులు, ఆంధ్రా సెటిలర్లు, కాపు సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో, వారి ఓట్లను ఆకట్టుకునేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.