
ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
AP: నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బుధవారం విషాదం నెలకొంది. కాగితాలపూరు క్రాస్ రోడ్డులోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదల్లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్ (18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై శివ రాకేశ్ అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.




