TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉపఎన్నిక అనివార్యం అయింది. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గోపినాథ్ సతీమణి సునీత పేరును ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్ తమ అభ్యర్ధిని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఏ క్షణంలోనైనా అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.