
ప్రభాస్ 'స్పిరిట్'.. సందీప్ రెడ్డి వంగ సంచలనం సృష్టిస్తారా?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన వాయిస్ ఓవర్‌కు విశేష స్పందన వచ్చింది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ప్రభాస్ విళయ తాండవం చేయబోతున్నారని, ఒక్కో సీన్ చూస్తే అభిమానుల రక్తం మరిగిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమాను 2027లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'స్పిరిట్'తో భారీ విజయం సాధించి, 2000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొడితే సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్‌గా మారతారని భావిస్తున్నారు.




