జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అధికార కాంగ్రెస్ రెండేళ్ల పాలన, హామీల అమలు, అభివృద్ధి తీరు, సీఎం రేవంత్ రెడ్డి పనితీరు వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఆర్ఆర్ పొలిటికల్ సర్వేస్ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్ కే మొగ్గు ఉందని తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో సానుభూతి ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పక్కా లోకల్ ఇమేజ్, సామాజికవర్గ బలం, గతంలో పోటీ చేసి ఓటమి పాలవడం వంటి అంశాలు ఆయనకు సానుభూతిని తెచ్చిపెడుతున్నాయి.