బీహార్‌లో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆధిక్యంలో సెంచరీ దాటింది. ప్రస్తుతం ఎన్డీయే అభ్యర్థులు 104 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహాగఠ్‌బంధన్ కూటమి 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 5 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.