
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు (వీడియో)
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది. సోమవారం రాత్రి మలయప్ప స్వామి గజవాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించగా, సాయంత్రం స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు కనువిందు చేశారు.




