జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పవచ్చు. సమోసా, వడా పావ్, మోమోస్ వంటి రుచికరమైన పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే వీటిని తినడం వల్ల శరీరంపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకుని సమతుల్యం పాటించడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక సమోసాలో సుమారు 262 కాలరీలు ఉంటాయి, వీటిని ఖర్చు చేయాలంటే దాదాపు 6వేల అడుగులు నడవాలి. వడా పావ్‌లో సుమారు 320 కాలరీలు, మోమోస్‌లో 360 కాలరీలు, పానీ పూరీలో 200 కాలరీలు, ఆలూ బర్గర్‌లో 450 కాలరీలు, చోళే భటూరేలో 600 కాలరీలు ఉంటాయి. ఈ క్యాలరీలను తగ్గించాలంటే వాటికి అనుగుణంగా శారీరక శ్రమ అవసరం.