TG: రాష్ట్ర ప్రభుత్వం జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసింది. నీటి కోసం రైతులు చేసిన పోరాటంపై BRS నేత KTR ప్రశంసలు కురిపించారు. ‘పొలాలు ఎండిపోతున్న తరుణంలో రైతుల చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుకర్రతో తట్టి, పరుగులు పెట్టించిన రైతులకు ధన్యవాదాలు. ఈ పోరాటంలో కలిసి నడిచిన BRS నాయకులకు కృతజ్ఞతలు. ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం’ అని ట్వీట్ చేశారు.