నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

22066చూసినవారు
నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్‌ జిల్లాలో జన్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you