TG: నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. NOV రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపడతామని, 2027 వానాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. OCT 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి డిజైన్లు అందిస్తామని, సాంకేతిక అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. జాతీయ సాంకేతిక సంస్థల సూచనల మేరకే పనులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.